Ashwini Tanaji | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 19 : అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను జిల్లా అధికారులు, తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఏసీ ని కలిసిన వారిలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, డిఆర్డిఓ శ్రీధర్, డిడబ్ల్యుఓ సరస్వతి, డివైఎస్ఓ శ్రీనివాస్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, మైనారిటీ సంక్షేమ అధికారి పవన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మెప్మా పీడీ వేణుమాధవ్, ఎన్వైకే కోఆర్డినేటర్ రాంబాబు, హౌసింగ్ పీడీ గంగాధర్, తదితరులు ఉన్నారు.