Small seeds Distribution | చిగురుమామిడి, జూలై 7: మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతులకు చిరు విత్తనాల పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిమేషన్ ద్వారా పప్పు దినుసులు, చిరు సాగు కిట్లను సోమవారం పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పప్పు దినుసుల సాగు ప్రోత్సహించడం కోసమే రైతులకు అందజేసినట్లు తెలిపారు.
రైతులకు 100 శాతం సబ్సిడీతో అందజేస్తామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి పంటలు దిగుబడి మెరుగుపరిచేందుకు సరఫరా చేస్తామని ఏవో రమ్య శ్రీ తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు కుదుబుద్ధిన్, ఓరుగంటి భారతి దేవి, బోడిగే పరుశురాములు, ఏఈవోలు ఎండీ ఫరీద్, సాయికుమార్, సతీష్, ప్రణయ్, అంజలి తదితరులు పాల్గొన్నారు.