Godavarikhani | కోల్ సిటీ, జూలై 23 : గోదావరిఖనిలో గీత కార్మికులకు గురువారం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రెండో నంబర్ గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు సురక్షితమైన కిట్లను అధికారులు అందజేశారు. వృత్తి రీత్యా తాటి, ఈత చెట్లు ఎక్కే క్రమంలో గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారనీ, ఇలాంటి పరిస్థితిలో ఈ ఆధునిక రక్షణ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. గీత కార్మికులకు వృత్తిపరమైన భద్రతకు ఎల్లప్పుడు సహకారం అందిస్తామన్నారు.
అనంతరం గీత కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనర్లు బుచ్చయ్య గౌడ్, జితేందర్, ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది స్వప్న, శ్రీనివాస్, గీత సహకార సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, రంగు రాజయ్య, బండారి రాంమ్మోహన్, గోపుగోని సతీష్, గంగాధర్ కృష్ణ, శ్రీనివాస్, పద్మ, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.