పెద్దపల్లి, ఆగస్టు 29 : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా భరోసానిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 137 మంది లబ్ధిదారులకు రూ.39,06,700ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సర్కారును మరోమారు ఆశ్వీరదించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరికీ లబ్ధిచేకూరలేదని, అప్పుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ప్రజాప్రతినిధులు, నాయకులు అనంతరెడ్డి, బండారి శ్రీనివాస్, రమేశ్, మార్కు లక్ష్మణ్, మనోజ్, రాజనర్సు, ముత్యాల రాజయ్య, సంజీవరెడ్డి, సదయ్య, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
నేను కొన్ని నెలలుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న. రూ.లక్షలు ఖర్చయినయ్. చేసిన అప్పులు కట్టే స్థోమత లేక ఇబ్బందులు పడ్డా. సీఎంఆర్ఎఫ్ కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిల్లులు, దవాఖాన చిట్టిలు ఇచ్చిన. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.4 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. పైసా ఖర్చు లేకుండా రూ.4 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సార్‌కు కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంట. నాలాంటి వారెందరికో అండగా ఉంటున్నరు.
– వునుకొండ సతీశ్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారు, సుభాష్‌నగర్, పెద్దపల్లి