Mulkanoor | చిగురుమామిడి, మే 23 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలకు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలకు అలసట ఏర్పడకుండా ఉండేందుకు మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి నీటిని పంపిణీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈజీఎస్ పనులు చేస్తున్న కూలీలకు కొంత ఉపశమనంగా ఉంటుందని అన్నారు. కూలీల డబ్బులు వారం వారం అకౌంట్ లో పడుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూలీలకు సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సాంబారి కొమురయ్య, వార్డు సభ్యులు లతా, రేణుక, కీర్తన, రాము, తిరుపతి, ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక, కారోబార్ ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మారేళ్ల రాజేష్, వీరయ్య, చంద్రయ్య, రాములు, కొమురయ్య, శ్రీకాంత్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.