Veenavanka | వీణవంక, డిసెంబర్ 26 : వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో సర్పంచ్ దాసారపు సరోజన, లస్మక్కపల్లిలో సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గొర్రెలు, పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీణవంక పశువైద్యాధికారి దాసరి శ్రీకాంత్, వీణవంక ఉపసర్పంచ్ తాళ్లపెల్లి మహేశ్ గౌడ్, నాయకులు దాసారపు రాజేంద్రప్రసాద్, దాసరి శ్రీకాంత్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.