కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 9 : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను అడ్డుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. “క్విట్ కార్పొరేట్ బీజేపీ ప్రభుత్వం, సేవ్ ఇండియా’ పేరిట అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ప్లకార్డు లు చేతపట్టి, గంటకు పైగా నినాదాలు చేశారు. ఈ సం దర్భంగా ధర్నాలో పాల్గొన్న రైతు సంఘాల నాయకు లు వర్ణ వెంకటరెడ్డి, పొనగంటి కేదారి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులు, కర్షకుల పొట్టగొడుతున్నదని దుమ్మెత్తిపోశారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తోందని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే దేశ వ్యాప్తంగా 61 బొగ్గు బ్లాకులను వేలం వేయడమన్నారు. ఈఎస్ఐ యాజమాన్య వాటాలు మాఫీ చేసిందని ధ్వజమెత్తారు.
పారిశ్రామిక, వ్యవసాయ రంగాల కు బడ్జెట్లో అంతగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన రైతాంగ సమ్మె లో రైతులకిచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చే యలేదన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతోందన్నారు.
నిరసనలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఐఎఫ్టీయూ జి ల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, టీఎన్టీయూసీ జిల్లా కన్వీనర్ కళ్యాడపు ఆగయ్య, వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లరాజు, బీకేఎంయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయిని అశోక్, సృజన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివా స్, గుడికందుల సత్యం, రాజమళ్ళు, పున్నం రవి, సుంకరి సంపత్, రాయికంటి శ్రీనివాస్, రాజేశం, ఇట్ట మల్లేశం, రామకృష్ణారెడ్డి, కిషన్ పాల్గొన్నారు.