Dharmaram | ధర్మారం, జనవరి 23: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న పెద్దపల్లి లో నిర్వహించిన జిల్లా స్థాయి తెలంగాణ ఇంగ్లీష్ ఒలింపియాడ్ (టీఈవో) ఇంగ్లీష్ వ్యాస రచన, ఉపన్యాస పోటీలలో పాఠశాలకు చెందిన టెన్త్ తరగతి విద్యార్థులు జీ.సహస్ర, ఓ. సంజన జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనభరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
కాగా వీరు ఈ నెల 24 న అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీలలో పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజకుమార్ తెలిపారు. కాగా ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాలలో ప్రిన్సిపల్‌తో పాటు ఆంగ్ల ఉపాధ్యాయులు శివరంజని, రాజశేఖర్, రత్నాకర్ తదితరులు అభినందించారు.