Dharmaram | ధర్మారం, నవంబర్ 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సన్మానించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు రాజకుమార్ చేపట్టారు. ఆయన విద్యార్థుల కోసం పాఠశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు సాధించిన విజయాలతో ప్రతీనెల మాస పత్రిక, విద్యార్థులలో సామాజిక, క్రమశిక్షణ, సేవ భావం ఏర్పాటు కోసం స్టూడెంట్ పోలీస్ కేడేట్ ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయాన్ని వృథా చేయకుండా ఎఫ్ఎం రేడియో 674.26 పాఠశాలలో ఏర్పాటు చేయడం, విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కలిసి మధ్యాహ్న భోజనం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ప్లాస్టిక్ రహిత పాఠశాల కార్యక్రమాల నిర్వహణ, పాఠశాలలో విద్యార్థులందరూ సమాన అవకాశాలతో అన్ని క్రీడలలో పాల్గొనే విధంగా ప్లే ఫర్ ఆల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాలలో నిర్వహించే పేరెంట్స్ కమిటీ మీటింగ్ కు తల్లిదండ్రులు గైర్ హాజరవుతున్న నేపథ్యంలో విద్యార్థి ఇంటికే ఉపాధ్యాయులు అని ఆదర్శ ఇంటి బాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వినూత్నమైన కార్యక్రమాలతో పాఠశాలను నిర్వహిస్తున్న క్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ హైదరాబాద్ లో ప్రిన్సిపల్ రాజకుమార్ ను ఆయన ప్రశంసించి సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృంద సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.