Basantnagar | పాలకుర్తి : పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బుగ్గరామలింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దట్టమైన అడవులు ఎత్తయిన కొండపై ఉన్న బుగ్గరలింగేశ్వర స్వామి ఆలయంలో బసంతనగర్ తోపాటు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ హెడ్ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ పార్షవేణి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రావ్, యువకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అంతర్గాం ఎస్సై వెంకట్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దాతల సహకారం తో భక్తులకు అల్పాహారం, ప్రసాదం అందజేశారు.