Refund the taxes..! | కార్పొరేషన్, సెప్టెంబర్ 17 : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులకు ఇంటి పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రోడ్ల సదుపాయాలు కల్పించే విషయంలో చూపించటం లేదంటూ అల్కాపురికి చెందిన దుంపేటి రాము కుటుంబ సభ్యులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
నగరంలోని తొమ్మిదో డివిజన్లోని అల్కాపురికి వెళ్లే రోడ్లో గుంతలు పడి ఉండడంతో దుంపటి రాములు, వారి పిల్లలతో పాటు కాలనీకి చెందిన పలువురు తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను వసూళ్లలో ఉన్న శ్రద్ధ మా తొమ్మిదో డివిజన్ రోడ్లమీద లేదని మండిపడ్డారు. రోడ్డు వేయాలని లేకుంటే తాము ఇంతవరకు కట్టిన హౌస్ టాక్స్ వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోడ్డును అభివృద్ధి చేయాలని అనేక మార్లు నగరపాల అధికారులకు వివరించినా ఎవరూ స్పందిచడం లేదని వాపోయారు. వర్షాలు పడినప్పుడు ఈ రోడ్డులో నడిచే పరిస్థితి కూడా ఉండడం లేదని, తమకు న్యాయం చేయాలని, రోడ్డు అభివృద్ధి చేయాలని కోరారు.