Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 1 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మార్పు కోసమే ఢిల్లీలో సీపీఐ బహిరంగ సభను నిర్వహించినట్లు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి గోలి బాపిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ముద్రకోల రాజయ్య అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు వారు హాజరయ్యారు. సమావేశ అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుందన్నారు.
దేశాభివృద్ధి ఉపాధి అవకాశాలు ప్రజా సంక్షేమం సుపరిపాలన అందిస్తామని చెప్పి నిత్యవసర వస్తువు ధరలో పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ దగ్గరలో పెంపుతో ప్రజలపై భారం మోపిందన్నారు. రోజురోజుకీ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర, చట్టబద్ధత కల్పించలేదని, మహిళా రిజర్వేషన్ అమలు చేయలేదని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం
సీపీఐ ఉద్యమాలు చేపడుతుందని వారు అన్నారు.