హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను గుర్తించి ప్రతిభా పురసారాలతో సతరిస్తున్నది. 2026 సంవత్సరానికిగాను శనివారం 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. పత్రికా ప్రసార రంగంలో డాక్టర్ వై నాగేశ్వర్రావుకు పురస్కారం దక్కింది. అక్టోబర్ 3న నాంపల్లి ఆడిటోరియంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేయనున్నట్టు విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి శ్రీకాంత్ తెలిపారు.
కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి(కవిత), ఆచార్య భక్తవత్సలరెడ్డి(విమర్శ/పరిశోధన), కూరెళ్ల శ్రీనివాస్ (చిత్రలేఖనం), ఏఎస్ ప్రకాశ్ (శిల్పం), దుడ్డు సీతారామయ్య (సంగీతం), డాక్టర్ అనిత(నృత్యం), డాక్టర్ నాగేశ్వర్రావు (పత్రికా ప్రసార రంగం), సురభి వెంగమాంబ (నాటకరంగం), సాలమ్మ (జానపదం), డాక్టర్ పట్వర్ధన్(అవధానం), కాత్యాయనీవిద్మహే(ఉత్తమ రచయిత్రి), కస్తూరి మురళీకృష్ణ (నవల) ఎంపికయ్యారు.