ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 8: ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జనరల్) మంజూ రు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈమేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్రాన్ని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుకకు అందించారు. కాగా, గతంలో ఇచ్చిన హామీ మేర కు మంత్రికేటీఆర్ ప్రత్యేక చొరవతీసుకోవడం తో మండల విద్యార్థుల కల నెరవేరింది. దీంతో మంగళవారం విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు మం డల కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు.
ప్ర భుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులు మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. సాయంత్రం బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండా రి బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పాతబస్టాం డులో పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ఎన్గందుల అనసూయ, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, ఏ ఎం సీ మాజీ చైర్మన్ అందె సుభాశ్, కొండ రమేశ్‌గౌడ్, సీనియర్ నాయకులు నమిలికొండ శ్రీనివా స్, తోకల శివారెడ్డి,అంజిరెడ్డి,అప్సరున్నీసా ఉన్నారు.