Corrupt unions | జ్యోతినగర్, సెప్టెంబర్ 14: ఈ నెల 25న రామగుండం ఎన్టీపీసీలో జరుగు గుర్తింపు ఎన్నికల్లో ఎన్టీపీసీ యూనైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)ను గెలిపించి, అవినీతి, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే ఐఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లను ఓడించాలని యూనైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్ బిక్షపతి అన్నారు. టౌన్ షిప్ లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దపాలుగా గెలిచిన ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్ అవినీతీకి అక్రమాలకు పాల్పడుందన్నారు. ప్రతీ పనికి ఒక రేట్ తో పైరవీలు చేస్తున్నట్లుగా ఆరోపించారు.
40 ఏండ్ల పోరాటంతో భూ నిర్వాసితులకు డబ్ల్యూ జీరో ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలు గడిచిన ప్రొబిషన్ పూర్తి అయినప్పటికీ రెగ్యూలర్ కాకపోవడం ఐఎన్టీయూసీ బాధ్యతన్నారు. ఈ ఎన్నికల్లో సీఐటీయూ గెలిస్తే వెంటనే డబ్ల్యూ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తి చేయించి రెగ్యూలర్ చేస్తామన్నారు. ఉద్యోగానంతరం పొందాల్సిన వైద్య సౌకర్యం పీఆర్ఎంఎస్. వర్తించేలా మార్పులు తెస్తామన్నారు. విద్యార్హతలు కలిగిన వారికి ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పాలసీని అమలు చేయిస్తాం, కిందిస్థాయి వారికి సీడీపీ ప్రోగ్రాం అమలు చేయిస్తామన్నారు.
ఈ గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూని హెచ్ఎంఎస్ బలపరుస్తుందని కార్మికులు సీఐటీయూని గెలిపించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యాక్షడు సిహెచ్ ఉపేందర్ పేర్కొన్నారు. ఇక్కడ ఎన్టీపీసీ యూనైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ భూమయ్య, ప్రధానకార్యదర్శి ఈదునూరి రాజేశ్వర్, కోశాధికారి బిక్షపతి, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు రామాచారి, పురుషోత్తం, రాజు, అశోక్ ఉన్నారు