ధర్మారం, ఫిబ్రవరి 18 : విద్యార్థులు ఉన్నత విద్య లక్ష్యంగా పురోగతిని సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ (Daya Aruna)సూచించారు. ధర్మారం మండలం పత్తిపాకలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ అరుణ మాట్లాడుతూ.. పదో తరగతి అనేది ఉన్నత విద్యలో ఎదగడానికి ఒక తొలిమెట్టు లాంటిదన్నారు.
ఈ క్రమంలో విద్యార్థులు పరీక్ష సమయంలో ప్రత్యేక దృష్టి సారించి 10 జీపీఏ సాధించడానికి శ్రమించాలని సూచించారు. ఉన్నత విద్య, స్కాలర్షిప్ ప్రాముఖ్యత అలాగే బేటి బచావో బేటి పడావో ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. బాల్య వివాహాలను అరికట్టాలని, ఆడపిల్లల పట్ల వివక్షత చూపవద్దని ఆమె తెలిపారు. చైల్డ్ హెల్ప్ లైన్ సేవలు, అత్యవసర సమయంలో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్ల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ బ్లాండిన, పాఠశాల ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి, ఐసీపీఎస్ బృంద సభ్యులు, సఖీ లీగల్ కౌన్సిలర్ సుమతి, విద్యార్థులు పాల్గొన్నారు.