జగిత్యాల, మార్చి 07 : మండుటెండల్లో కూడా చెరువులు మత్తడి దూకించిన ఘనత కేసీఆర్‌కే(KCR) దక్కుతుందని జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వంజేరపల్లె గ్రామంలో పూర్తిగా ఎండిపోయిన ఉప్పు కుంట చెరువును నాయకులు, రైతులతో కలిసి దావ వసంత సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మండుటెండల్లో కూడా మత్తడి దూకి, చివరి ఆయకట్టు వరకు నీరందించిన ఘనత కేసీఆర్‌కే చెందుతుందన్నారు.
ఎండుతున్న పంటలకు వెంటనే నీళ్లు అందించాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి పంట పొలాలకు నిరందించాలని రైతన్నల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద రావు, నాయకులు కమలాకర్ రావు రావి రాజు, తిరుపతి, మహేష్, గంగారెడ్డి, శంకర్, సురేష్, హరీష్ యాదవ్ సంఘం అధ్యక్షుడు ధర్మయ్య, రైతులు పాల్గొన్నారు.