Daughter win | కోరుట్ల : గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి పోటీ జరిగాక తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
కూతురు ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుండి ఇది రెండు కుటుంబాలు మధ్య విభేదాలు వచ్చాయి. బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో తల్లి కూతుర్లు పోటీపడగా కూతురు విజయం సాధించింది.