Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 30: గోదావరిఖని నగరంలోని కళ్యాణ్ నగర్ ఎఫ్సీఐ క్రాస్ రోడ్ వద్ద కళ్యాణ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని కలశంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శుక్రవారం సాయంత్రం గణపతి సన్నిధిలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, మహిళలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లిపోయారు.
అర్ధరాత్రి సమయంలో విఘ్నేశ్వరుడి పాదాల వద్ద ఉన్న కలశంలో ఒక్కసారిగా అమ్మవారిని పోలిన రూపంలో దర్శనమివ్వగా భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. నిజంగా అమ్మవారే పచ్చారంటూ మంత్రముగ్ధులయ్యారు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో చుట్టు ప్రక్కల నుంచి కూడా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.