హుజూరాబాద్ రూరల్, నవంబర్ 20: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు మహత్తర పథకమని, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రంగాపూర్ గ్రామంలో సిరికొండ సుమన్ దళిత బంధు కింద ఏర్పాటు చేసుకున్న మెడికల్ షాపును, పద్మనగర్ కాలనీకి చెందిన దూడపాక జాన్, కలకోట రవీందర్‌కు మంజూరైన కారును వినోద్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం మా ట్లాడారు.
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సమ న్యాయం చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఇక్కడ జడ్పీ చైర్ పర్సన్ విజ య, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, మాజీ చైర్మన్ విజయ్‌కుమార్ ఉన్నారు.