చిగురుమామిడి, మే 6 : డ్రగ్స్ కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, జేఏసీ నాయకులు కోడూరి శ్రీదేవి, చెప్యాల ప్రకాష్ అన్నారు. మండలంలోని ఉల్లంపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి, రేకొండ గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర అవగాహన సదస్సులు మంగళవారం నిర్వహించారు. రోజురోజుకు డ్రగ్స్ వాడకం యువతలో పెరుగుతుందని అన్నారు. సిగరెట్లు, గంజాయి ఇతర వ్యాపకాలకు యువత బానిసలు అవుతున్నారని, చెడు మార్గాలను అన్వేషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత చెడు మార్గాన వెళ్లొద్దనే మండలంలో డ్రగ్స్ పోరు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మహిళలు ఇంట్లో యువత అవలంబిస్తున్న విధానాలను తరచూ గమనించాలన్నారు. వాటి నిర్మల కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీమూర్తి రమేష్, వేముల జగదీష్, నాంపల్లి సమ్మయ్య, తోటపల్లి జగన్, కుమారస్వామి సెర్ఫ్ (ఐకెపి) సీసీలు వెంకటమల్లు, సత్యనారాయణ, మహిళలు తదితరులు ఉన్నారు.