Current motor | శంకరపట్నం, జూలై 9 : మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లేందుకు యత్నించి సాధ్యం కాకపోవడంతో సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే ప్లాస్టిక్ పైపులను ధ్వంసం చేశారు. ఇద్దరివి కలిపి సుమారు రూ.26 వేల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసు సిబ్బంది బావుల వద్దకు వచ్చి చోరీ తీరును పరిశీలించారు. కాగా వ్యవసాయ బావుల వద్ద మోటర్లలో కాపర్ వైర్లు, సర్వీస్ వైర్లు, స్టార్టర్ల దొంగతనాలు షరా మామూలుగా మారిందని పలువురు రైతులు వాపోయారు. రెండు నెలలలో కేశవపట్నం గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకన్న, ఖాజామొయినొద్దీన్, కల్లెపెల్లి సంపత్, తదితరులకు చెందిన కరంటు మోటార్లు చోరీకి గురయ్యాయనీ, పట్టించుకునే నాథుడు కరువయ్యాడని పలువురు రైతులు సోషల్ మీడియా వేదికగా వాపోయారు.