Cultural programs | వీణవంక, సెప్టెంబర్ 15 : వీణవంక మండలంలోని ఘన్ముక్ల ఆదర్శ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కళా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మండల స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు విద్యార్థులు హాజరై కళలను ప్రదర్శించారు. మొత్తం 8 రకాల రంగాలలో విద్యార్థులు కళలను ప్రదర్శించగా ఆయా పాఠశాలల హెచ్ఎంలు మార్కులు వేసి, ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ఎస్ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కళాఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేశామన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు పులి అశోక్ రెడ్డి, సంపత్ కుమారచారి, మోయిజ్ బేగ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.