Kondagattu Anjana Temple | మల్యాల: జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో వేసవి సెలవులు సమీపిస్తున్న తరుణంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నాచుపల్లి గ్రామ శివారులోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆలయంలోని వై జంక్షన్ వరకు రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు ఆంజనేయ స్వామి వారి దర్శనం అయ్యేందుకుగాను ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ క్యూలైన్లను క్రమబద్ధీకరించారు.
స్వామివారి ఆలయంలో పలువురు భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అష్టోత్తర శతనామావళి పూజ, హారతి, అంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేఖం తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనుబంధ ఆలయాలఐన బేతాళ స్వామి, ముని గుహలు, సీతమ్మ కన్నీటి ధార ,బొజ్జబోతన, కోదండ రామాలయం, కొండల రాయుడు పాదుకల ముద్రలు తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకుని భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. సుమారు శనివారం 30 వేల పై చీరలకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, ఆలయానికి వివిధ సేవల రూపంలో ఎనిమిది లక్షల వరకు ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ అధికార వర్గాలు వెల్లడించారు.