వేములవాడ టౌన్, జూన్ 9: మరో రెండురోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. రాజన్నకు ప్రీతిమొక్కైన కోడెమొక్కు తీర్చుకున్నారు.
క్యూ లైన్ల గుండా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులు గండాదీపం మొక్కులు, కుంకుమపూజలు, పల్లకీసేవలు, కల్యాణ మొక్కులు, సత్యనారాయణవ్రతాల మొ క్కులు తీర్చుకున్నారు. రాజన్నను దాదాపు 10 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, సుమారు 14 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.