 
                                                            మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ముంత పోత పోసినట్టు కురిసిన భారీ వర్షంతో జిల్లా అంతా అతలాకుతల మైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి చేతిక చ్చిన పొలాలు నీట మునగగా, పలు చోట్ల నేలవాలా యి. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వరదలతో పలు చోట్ల రోడ్లు తెగిపోగా, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కరీంనగర్, అక్టోబర్30 (నమస్తేతెలంగాణ): మొంథా తుపాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిం ది. తుపాన్ కారణంగా హు జూరాబాద్ డివిజ న్లో రికార్డు స్థాయిలో 281.4మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదుకావడంతో అపార నష్టం వాటి ల్లింది. ఈ క్రమంలో మండలంలో 3,959 ఎకరా ల్లో పంటలు దెబ్బతిన్నాయి. సైదాపూర్‌లో అత్య ధికంగా 4,123 ఎకరాలు, మానకొండూర్‌లో 3,800, చిగురుమామిడిలో 3,383, శంకర పట్నంలో 2,100 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న ది. కొత్తపల్లిలో అత్యధి కంగా 1,200ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నది. సైదాపూర్‌లో 324, కరీంనగర్ రూరల్‌లో 593, ఇల్లందకుంటలో 300, గన్నేరువరంలో 220, జమ్మికుం టలో 200 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తుపాన్ నష్టంపై కలెక్టర్ సమీక్ష
తుపాన్‌తో జిల్లాలో జరిగిన నష్టంపై కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో గురువారం సమీక్ష నిర్వ హించారు. ఆస్తి, పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని అధికా రులను ఆదేశించారు. వర్షం కారణంగా జిల్లాలో 8 పశువులు మరణించాయని, వీటి యజమాను లకు వెంటనే నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాక్షి కంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందజేయా లన్నా రు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా సుమారు 2,036మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు సమాచారం ఉందని, రైతు వారీగా తడిసిన ధా న్యం వివరాలను సేకరించాలన్నారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్కమిషనర్ ప్రపుల్ ఉన్నారు.
159.0 మిల్లీ మీటర్ల వర్ష పాతం.. 
గంగాధర 124.4, రామడుగు 182.8, చొప్ప దండి 99.7, కరీంనగర్ రూరల్ 118.0, కొత్తప ల్లి 123.2, గన్నేరువరం 127.5, కరీంనగర్ 200.4, మానకొండూర్ 156.6చ తిమ్మాపూర్ 155.5, చిగురుమామిడి 257.9, సైదాపూర్ 231.0, శంకరపట్నం 172.7, వీణవంక 109. 0, హుజూరాబాద్ 281.4, జమ్మికుంట 98.9, ఇల్లందకుంట 105.0, జిల్లా సగటు 159.0 మిల్లీ మీటర్లుగా వర్షపాతం నమోదైంది.
హుజురాబాద్‌లో 21సెంటీమీటర్లు..
హుజూరాబాద్, అక్టోబర్ 3: హుజూరాబాద్ డివిజన్లో అత్యధికంగా 21సెంటీమీటర్ల వర్షపా తం నమోదు కావడంతో 1300ఎకరాల్లో వరి, 1,500 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. చిలక వాగు, రంగనాయకుల గుట్ట వద్ద కల్వర్టు ఉధృ తంగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

పరిహారం ఇప్పించాలని రైతుల రాస్తారోకో
హుజూరాబాద్‌రూరల్, అక్టోబర్30: సింగా పూర్ సమీపంలో జాతీయ రదారిపై బ్రిడ్జి వేయక పోవడంతో పెద్ద చెరువు మత్తడి నుంచి వచ్చిన నీళ్లతో రహదారి తెగిపోవడంతో సుమారు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కాంట్రాక్టర్ పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు కరీనం గర్-వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండలంలో 4వేల ఎకరాల్లో వరి పంట, 800ఎకరాల్లో పత్తి పంట నష్టం జరి గినట్లు ప్రాథమిక అంచనా వేశామని ఏవో భూమి రెడ్డి తెలిపారు. ధ్మరాజుపల్లిలో చిలుముల లక్ష్మి ఇల్లు నేలకూలింది.
కొట్టుకుపోయిన యువకుడు
గన్నేరువరం, అక్టోబర్ 30: బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు టీవీఎస్ ఎక్సెల్‌పై కరీంనగర్ వైపు వెళ్తుండగా, మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద కల్వర్టుపై నీటి ప్రవాహం అధికంగా ఉండ డంతో వాహనం అదుపు తప్పింది. దీంతో ఓ యువకుడు నీటిలో కొట్టుకుపోతూ నిమర్జనం చేసిన దుర్గామాత విగ్రహానికి తట్టుకొని ఆగాడు. మత్స్యకారులు తాళ్ల సాయం ఆ యువకుడిని కాపాడారు. పారువెల్ల పెద్ద చెరువు, గన్నేరువరం, జంగపల్లి చెరువులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
2,100 ఎకరాల్లో పంట నష్టం
శంకరపట్నం, అక్టోబర్ 30: మండలంలో 2,100 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. కేశవప ట్నంలో దుర్గం వెంకటమ్మ, మొలం గూర్లో జం పాల పోచయ్య ఇండ్లు కూలిపోయా యి. కేశవప ట్నం వాగులో చెక్‌డ్యాం కొట్టుకుపోయింది. ఆరెపల్లి తిరుపతికి గేదె గల్లంతయింది.
కొట్టుకుపోయిన బాతు పిల్లలు 
మానకొండూర్రూరల్, అక్టోబర్ 30: ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మేన్పడ్ డేవిడ్-ధన లక్ష్మితోపాటు పది మంది కుటుంబ సభ్యులు 20వేల బాతులతో మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్ శివారులోని మానేరు తీరంలో నేషనల్ హైవే బ్రిడ్జి కింద ఉంటున్నారు. బుధవా రం రాత్రి ఎల్ఎండీ 14 గేట్లు ఎత్తగా, ప్రవాహం ఎక్కువ కావడంతో వీరు నివాసం ఉంటున్న డేరాల లోపలికి నీళ్లు చేరాయి. దీంతో అందులో ఉండే దాదాపు 16వేల బాతు పిల్లలు ప్రవాహా నికి కొట్టుకుపోగా, కుటుంబ సభ్యులు 4వేల బాతు పిల్లలను రక్షించారు.
200ట్రిప్‌ల వడ్లు నీటి పాలు
సైదాపూర్, అక్టోబర్30: మండలంలో 202.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు 4వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కల్వర్టుల వద్ద వరద నీటి ప్రవాహానికి హుజూరాబాద్-సై దాపూర్, ఎక్లాస్పూర్, సోమారం, రాములపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆకునూర్లో రోడ్డు కొట్టుకుపోయింది. సైదాపూర్ పాతబస్టాండ్తో పాటు దుద్దనపల్లి ఎస్సీ కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
విద్యుత్ శాఖకు రూ.10లక్షల నష్టం
ముకరంపుర, అక్టోబర్30: తుపాన్ ప్రభావం తో జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.10లక్షల నష్టం వాటిల్లింది. 23స్తంభాలు, 17ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 9ట్రాన్స్ఫార్మర్లలో నీళ్లు చేరగా పునరుద్ధరణ చేయడంతో పాటు దెబ్బతిన్న స్తం భాలను యుద్ధ ప్రాతిపదికన సరి చేస్తున్నట్లు కరీం నగర్ సరిల్ ఎస్ఈ రమేశ్‌బాబు తెలిపారు.
కన్నీళ్లు మిగిల్చిన కట్టుకాలువ
తుమ్మల చెరువు మత్తడి నుండి వరద నీటి ప్రవాహం ఎక్కువై కట్టు కాలువ రెండుచోట్ల తెగి పోయింది. వెన్కేపల్లి పొలాల నుంచి భారీగా వరద కొనుగోలు కేంద్రాలకు చేరింది. తెల్లారేసరికి వరదనీటి ప్రవాహానికి పలువురి రైతులకు చెందిన సుమారు 200ట్రిప్‌ల వడ్లు కొట్టుకుపోయాయి.
మోకాళ్ల లోతు నీటిలో పొలాలు
జమ్మికుంట, అక్టోబర్30: మాచినపల్లికి చెంది న లెక్కల జగదీశ్వర్‌రెడ్డి తనకున్న ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని లక్షల పెట్టుబడితో సాగు చేశాడు. తుపాన్ ఫలితంగా పంటంతా నీటిలో మునిగి పోయింది. ఇది తెలి సి పొలం వైపు వచ్చే ధైర్యం చేయడం లేదు. ‘మోకాళ్ల లోతు నీటిలో మరో రోజు ఉంటే.. చేతి కచ్చిన వరి పంటంతా మురిగి పోతుందని, గింజ అక్కరకు రాకుండా అవుతుంది’ అని చెబుతూ.. అతడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
జలదిగ్బంధంలో కలెక్టరేట్
కలెక్టరేట్, అక్టోబర్30: కలెక్టరేట్ జలదిగ్బంధ మైంది. నలుమూలల మూడు ఫీట్ల మేర నీరు నిలిచింది. ఓవైపు కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరు గుతుండడం, మరోవైపు ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వర్షపు నీరంతా పాత కలెక్టరేట్ చుట్టూ చేరింది. గురువా రం ఉదయం వరకు కూడా వర్షపు నీరు కార్యాల యాలను చుట్టుముట్టే ఉండడంతో సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి వచ్చే విజిటర్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మెయిన్‌గేటుకు సమీపంలో గల భారీ వృక్షం కూలి పోలీస్ ఔట్‌పోస్టుపై పడిపోగా, యంత్రాలతో దానిని తొలగించారు.
ఇండ్లకు చేరిన నీరు
గంగాధర, అక్టోబర్ 30: గ్రామాల్లో కోత కు వచ్చిన వరి పొలాలు నీటమునిగాయి. అధికా రులు సర్వే చేసి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. లక్ష్మిదేవిపల్లిలో ఇండ్లలోకి నీళ్లు చేరి గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు.
తిమ్మాపూర్, అక్టోబర్30: రామకృష్ణ కాలనీ శివారులో కుంట కింద వెంచర్ ఏర్పాటు చేసి, తర్వాత మత్తడి వెళ్లేందుకు చిన్న మోరీ కట్టారు. దీంతో నీళ్లు బయటకు వెళ్లలేక సమీప పొలాల న్నీ మునిగిపోయాయి. తిమ్మాపూర్-పోరండ్ల, వచ్చు నూర్-జోగుండ్ల, పోలంపల్లి- మొగిలిపాలెం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
చొప్పదండి/మానకొండూర్ రూరల్/కరీంనర్ రూరల్, అక్టోబర్ 30: కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, రోడ్ల పై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద యింది. అధికారులు స్పందించి కొనుగోలు కేం ద్రాల్లో ప్రారం భించాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ మండలంలో 2,498ఎకరాల వరి, 1,033 ఎకరాల పత్తి పంట నష్టం జరిగింది
ఇల్లందకుంట అక్టోబర్ 30: సిరిసేడులో గొట్టె శంకర్ ఇల్లు కూలిపోయింది. పంటలను ఏవో సూర్య నారాయణ పరిశీలించారు. వరి 1200, పత్తి 300ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలిపారు.
చిగురుమామిడి, అక్టోబర్30: రేకొండ-మొగి లిపాలెం, ఎగ్లాస్పూర్కు రాకపోకలు నిలిచిపో యాయి. ఏరుకొండ రమేశ్‌కు చెందిన పశువుల పాక కూలి మూడు జీవాలు కొట్టుకుపోయాయి. పెద్దమ్మపల్లెలో కడెం సరవ్వ మహిళా రైతుకు చెం దిన 120క్వింటాళ్ల వరి ధాన్యంకుప్ప నీటిలో మునిగిపోయింది. మోయ తుమ్మెద వాగు ఉధృ తంగా ప్రవహించడంతో 30మంది రైతుల వ్యవ సాయ మోటార్లు మునిగిపోయాయి. సీతారాం పూర్లో కౌలు రైతు మేకల బొందయ్య నాలుగె కరాల వరి పంట కొట్టుకుపోయింది. సీతారాం పూర్-కరీంనగర్ రహదారి మధ్య తారు రోడ్డు పూర్తిగా పోయింది. ఇందుర్తిలో ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో కోహెడ వైపు రాక పోకలు నిలిచిపోయాయి. 3,441ఎకరాల వరి పంట నష్టం వాటిలిందని అంచనా వేశామని ఏవో మల్లేశం తెలిపారు. పంటలను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంజయ్య పరిశీలించారు.
కొత్తపల్లి, అక్టోబర్ 30: కమాన్‌పూర్, ఎలగం దులలో 2,500 ఎకరాల వరి, 1,200ఎకరాల పత్తికి నష్టం జరిగింది. మల్కాపూర్‌లోని లక్ష్మీ హోంమ్స్లోని పలు నివాసాలు నీటి మునిగాయి. సుడా చైర్మన్ నీటి మునిగిన ఇళ్లను పరిశీలించారు.
సైదాపూర్, అక్టోబర్30: సైదాపూర్-హుజూ రాబాద్, మెలంగూర్, ఎగ్లాస్ పూర్-వెన్నంపల్లి, సైదాపూర్-వెన్నంపల్లి, ఎలబో తారం-గొడిశాల, వెంకటేశ్వర్లపల్లి-శివరాంపల్లి, పెర్కపల్లి-దుద్దనప ల్లి, ఘనపూర్-రాయికల్తండా, రైతు వేదిక-సింగరాయబోరు రోడ్లు దెబ్బతిన్నాయి.
 
                            