Cricket competitions | తిమ్మాపూర్, జనవరి 14 : తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ నోముల రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్ లీగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీలను సర్పంచ్ శోభారాణి తో కలిసి ఉపసర్పంచ్ రాజేష్ గౌడ్ ప్రారంభించారు. గత 5 ఏళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించామని రాజేష్ తెలిపారు.
పండుగ పూట యువత చెడు అలవాట్లకు గురికాకుండా క్రీడ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీ అందజేయనున్నట్లు రాజేష్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.