CPR training | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శుక్రవారం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ గురైతే అత్యవసర పరిస్థితిలో సీపీఆర్ ఎలా చేయాలనే ఆందోళన ఉంటుందని, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండేందుకే ఈ సీపీఆర్ శిక్షణ ఇస్తున్నట్లు ఆస్పత్రి ట్రైనర్ మహేష్ వెల్లడించారు.
సీపీఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సీపీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఆర్ పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మెడికవర్ ఆస్పత్రికి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.