Chigurumamidi | చిగురుమామిడి, జూలై 28 : నీట్ పేపర్ లీకేజీ కారణంగా మృతి చెందిన విద్యార్థులకు సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తును కోల్పోతున్నారని, గత కొంతకాలంగా నీట్ పేపర్ లీకేజీ కి కారణమైన వారిని శిక్షించాలని సీపీఐ మండల కార్యదర్శి నాగేలీ లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . విద్యార్థులపై లాఠీచార్జి, భాష్ప వాయువులు ప్రయోగించడం పట్ల విద్యార్థులు మృతి చెందారని అన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, తేరాల సత్యనారాయణ, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, ఉపసర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, మండల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గోలి బాపి రెడ్డి, ముద్ర కోల రాజయ్య, రాకం అంజయ్య, ఎలగందుల రాజు, విలాసాగరం అంజయ్య, కయ్యం తిరుపతి, అనువోజు జనార్ధన్, వీరయ్య తదితరులు పాల్గొ