తాగునీరు మహాప్రభో..
కరీంనగరంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. అరగంటకుపైగా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
- కరీంనగర్ మున్సిపల్ ఎదుట సీపీఐ ధర్నా
- ఖాళీ బిందెలతో బైఠాయింపు
కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 25 : కరీంనగరంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. అరగంటకుపైగా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కార్పొరేషన్ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం నాయకులను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మానేర్ డ్యాంలోని నీటిని పక్క జిల్లాకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. ముందుగా నగర వాసులకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నా బీజేపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అంతే కాకుండా నగరంలోని విలీన గ్రామాల్లోని చెరువులు కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, బుచ్చన్నయాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, స్రవంతి, రాజయ్య, మచ్చ రమేశ్, ఆంజనేయులు, హేమంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

