వేములవాడ, ఏప్రిల్ 2 : రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాల టెండర్, వేలం పాటను తగ్గించి ఇస్తేనే ముందుకు వస్తామని కాంట్రాక్టర్లు తేల్చారు. రాజన్న ఆలయంలో 2025-27 రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాలను సేకరించుకునేందుకు టెండర్, బహిరంగ వేలం పాటను 4వ సారి రాజన్న ఆలయం లో నిర్వహించారు. గడిచిన మూడు టెండర్లకు ఎవరూ ముం దుకు రాకపోగా, బుధవారం మాత్రం కళావతి ఎంటర్ప్రైజెస్, నాగ కుమారి ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్లు హాజరయ్యారు. అయితే స్వామి వారి పాటగా 19 కోట్ల ఎనిమిది వేల నుంచి రాజన్న ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ ప్రా రంభించారు. తాము అంతా వేలంపాటలో పాల్గొనలేమని కాం టాక్ట్ వెల్లడించి తకువ నుంచి పాటను ప్రారంభించారు. కళావతి ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి ఎల్లయ్య రూ. 6 కోట్ల వరకు తన పాటను పాడారు. ఇక నాగ కుమారి ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి భువన్ ఆరున్నర కోట్ల వరకు పాడగా అధికారులు ఇంత తకువకు తాము టెండర్ ఇవ్వలేమని వేలంపాటను రద్దు చేసినట్లు ప్రకటించారు. తిరిగి ఏప్రిల్ 10న నిర్వహిస్తామని వెల్లడించారు.
తలనీలాల సేకరణ టెండర్, వేలంపాటను ఆలయ అధికారులు నిర్వహించారు. అయితే వేలంపాట రాజన్న ఆలయ ఈఈ రాజేశ్ సమక్షంలోని ఆయన కార్యాలయంలో నిర్వహించగా, ఏఈవో శ్రవణ్ కుమార్, పర్యవేక్షకుడు విజయ్ కుమార్, ఏఈ రామ్ కిషన్‌రావు, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనర్సయ్య హాజరయ్యారు. ఇక వేలంపాటకు ఇద్దరు కాంట్రాక్టర్లు హాజరుకాగా ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమైతే భక్తుల రద్దీ తగ్గి, కల్యా ణ కట్ట కూడా దూరం అవుతుందని దీనిపై స్పష్టత ఇవ్వాలని అ ధికారులను వారు కోరారు. దీంతో ఈవో వినోద్ రెడ్డి వీడియో కాల్ ద్వారా సాదరు కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పారు. షెడ్యూల్లోనే ఇందుకు సంబంధించిన నిబంధన ఉందని వివరించారు. మొత్తం వేలం పాట పూర్తయ్యే వరకు ఆయన వీడియో కాల్ ద్వారా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు.
నాలుగోసారి తలనీలాల సేకరణకు నిర్వహించిన టెండర్‌కు కాంట్రాక్టర్లు హాజరైన సరైన ధర రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. తిరిగి ఐదో సారి ఏప్రిల్ 10వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు.