కరీంనగర్ ముకరంపుర, జూలై 28 : వినియోగదారుల సమస్యల పరిషారానికి పెద్దపీట వేస్తున్న ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖలో ఇప్పటికే నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజావాణికి మంచి స్పందన వస్తున్నది. ఈ క్రమంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సరికొత్తగా విద్యుత్ కార్యాలయాల్లో కన్జ్యూమర్ రిసెప్షన్ డెస్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
వినియోగదారుడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన వెంటనే త్వరితగతిన పరిషరించే దిశగా సరిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో కన్జ్యూమర్ రిసెప్షన్ డెస్ను అమలు చేస్తున్నట్లు కరీంనగర్ సరిల్ ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ తెలిపారు. వినియోగదారులు అన్ని రకాల విద్యుత్ సమస్యల పరిషారం కోసం నేరుగా ఏదైనా ఒక సరిల్, లేదా డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో సంప్రదించి ఫిర్యాదు చేసి రసీదు పొందవచ్చు.
నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదులను పరిషరించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఫిర్యాదు దారు తన ఫిర్యాదు స్థితిగతులను ట్రాక్ చేసుకొనే వీలుంటుంది. ఫిర్యాదు పరిషారంపై సంతృప్తి చెందినట్లయితే తిరిగి మళ్లీ ఫిర్యాదు నమోదుకు ఆవకాశం కల్పించారు.
వినియోగదారుడి ఫిర్యాదు పరిషారం అయ్యేంత వరకు ఫిర్యాదు మూసివేత ఉండదు. కన్జూమర్ రిసెప్షన్ డెస్లో నమోదైన ఫిర్యాదు స్థాయిని బట్టి డీఈ, ఎస్ఈ, కార్పొరేట్ కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేస్తూ వినియోగదారులకు పూర్తి స్థాయిలో సేవలందించేలా సీఎండీ కన్జూమర్ రిసెప్షన్ డెస్లను తీర్చిదిద్దారు.