Indiramma houses | సారంగాపూర్, జూలై 30: ప్రభుత్వ నింబంధనలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీవో బుధవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఇండ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని ఇండ్ల నిర్మాణాలకు దశల వారిగా ప్రభుత్వం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సర్వశ్రేష్ట, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.