suicide attempts | సిరిసిల్ల రూరల్, జూలై 13: కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెలితే.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో కేసీఆర్ హాయంలో, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 27 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం చేశారు.
కారణాలతో పంపిణీ వాయిదా పడింది. ఈ క్రమంలో రాబోయే స్థానిక ఎన్నికల నేపద్యంలో ఆఘామోఘాల మీద లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో భరణ్ ఆందోళన చెందాడు. కార్యాలయం ఆవరణలో కుటుంబసభ్యులతో ఆందోళనచేశారు.
ఆదివారం సైతం ఓ నాయకుడితో వాగ్వావాదానికి దిగాడు. పైసలు ఇవ్వకుంటేనే తన పేరు జాబితాలోంచి తొలగించారని ఘర్షణ పడ్డాడు. కాగా గ్రామస్తులు శాంతింప చేశారు. తరువాత తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. శనివారం రోజు డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితాలో తనపేరు లేకుండా ఇళ్లు మంజూరు కాకుండా చేశారంటూ ఓ కాంగ్రెస్ నేతపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
పురుగుల మందు డబ్బా పట్టుకుని గ్రామంలో కొందరి యువకులకు వీడియో కాల్ చేయడంతో హుటాహుటిన భరణను ఉన్న స్థలానికి కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెళ్లి కాపాడారు. భరణ్కు నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. ఈఘటన చర్చానీయాంశమైంది.