Election promise | పాలకుర్తి : పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో గురువారం ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులతో, వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000 పెంచాలని, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈనెల 20న గోదావరిఖనిలో పెన్షన్ దారుల సదస్సుకు వచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సదస్సు విజయవంతం చేయాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు కుక్క మహేష్, ఉపాధ్యక్షులు బెక్కం రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి ఏదుల జాసిన, ప్రచార కార్యదర్శి బెక్కం మల్లయ్య,సంయుక్త కార్యదర్శి బెక్కం రాజమ్మ, కార్యదర్శి కుక్క దుర్గయ్య, కార్యవర్గ సభ్యులు బెక్కం నంబయ్య,ముల్కల నర్సమ్మ, బేక్కం పద్మాలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ పాలకుర్తి ఇంచార్జ్ కొండల రాజేందర్ కుమార్, మండల నాయకులు రసపల్లి రవికుమార్, కాజీపేట రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బెక్కం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.