Siricilla | గంభీరావుపేట, ఏప్రిల్ 17.: మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో లేదని బీఆర్ఎస్ నేతలు అధికారులను ప్రశ్నించారు. ఇందుకు కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. ఈ ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.
ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసినందున బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పెద్దవీని వెంకట్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గోలింగం యాదవులపై అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దాడి చేసిన కాంగ్రెస్ నేతలను కఠినంగా శిక్షించి కేసు నమోదు చేయాల్సిన అధికారులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడిచేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.