Kaythanpally | క్యాథన్ పల్లిలో కాంగ్రెస్ అరాచకం చేస్తోంది.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
మంచిర్యాల జిల్లా క్యాథన్ పల్లి మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీలు సంయుక్తంగా 14 మంది కౌన్సిలర్లు విజయం సాధించి సంపూర్ణమైన మెజారిటీ సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు.
Kaythanpally | పెద్దపల్లి, ఫిబ్రవరి 17( నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి కమాన్: మంచిర్యాల జిల్లా క్యాథన్ పల్లి మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీలు సంయుక్తంగా 14 మంది కౌన్సిలర్లు విజయం సాధించి సంపూర్ణమైన మెజారిటీ సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. కేతనపల్లిలో మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎంపీ బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై మంగళవారం జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇలాంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరమన్నారు అడ్డమైన దారిలో ఆరాచకం ఇది తప్పుడు విధానం అన్నారు. ప్రభుత్వం, ఎన్నికల అధికారులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. మాజీ ఎంపీ బాల్క సుమన్ కు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ నిలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామంలో ఇది దుర్మార్గమని కంచె చేను మేస్తే.. ఆ కంచెను కూడా మేసే వారు వుంటారని పేర్కొన్నారు. అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, బీఆర్ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీష్ గౌడ్, కౌన్సిలర్ వెన్నం రవీందర్- సుజాత, సలేంద్ర రాముల యాదవ్ ,మోబిన్, ఖదీర్ ఖాన్, కార్తీక్, మండల పార్టీ నాయకులు బాల్సాని ఈశ్వర్ గౌడ్, తీగల సదయ్య , ముత్యాల రాజయ్య,, సుంచు సది,జై, రామ్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, కాశిపాక వాసు, కానీ నరేష్, పల్లె మధు, ఖాదర్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, బాలసాని నరేష్, ముత్యం లక్ష్మణ్, ధర్మపురి, ప్రేమ్ సాగర్, కిట్టు యాదవ్ తో పాటుగా పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

