గొల్లపల్లి, అక్టోబర్ 17: ‘కాంగ్రెస్ పెద్ద మోసకారి. ఆ పార్టీ నాయకులు నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే. ఎన్నికలు వస్తున్నయని మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నరు. సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నరు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు. బీఆర్ఎస్ శ్రేణులకు నేనొక్కటే చెబుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఎత్తులన్నీ చిత్తు చేయాలి. గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం గొల్లపల్లి మండలం గోవింద్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయం సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.
కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి చేసిందేమీ లేదని, ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అధికారం కోసం సాధ్యం కానీ హామీలు ఇస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ఆ పార్టీ నేతల దిమ్మతిరిగిందని, ఏం చేయాలో అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డున్న ప్రతి మహిళకు నెలకు రూ.3వేలు అందిస్తామని, ప్రజలందరికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా వర్తింపజేస్తామని, ఇంకా ఆసరా పింఛన్ రూ.2,016 నుంచి రూ.5,016, రైతు బంధు ఎకరానికి రూ.10వేల నుంచి రూ.16 వేలకు పెంచుకుంటామని చెప్పారు. ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉండే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వానికి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ శంకరయ్య, జడ్పీటీసీ జలందర్, ఏఎంసీ చైర్మన్ హన్మాండ్లు, వైస్ చైర్మన్ లింగా రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యం, ప్యాక్స్ అధ్యక్షులు రాజసుమన్ రావు, మధవరావు, పార్టీ అధ్యక్షుడు రమేశ్, యూత్ అధ్యక్షుడు రవీందర్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగా రెడ్డి, మండల కోఆర్డినేటర్ గంగాధర్, యూత్ కోఆర్డినేటర్ రాంచందర్ రెడ్డి, అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచి మారం రాజశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు లింగా రెడ్డి, నారాయణ రెడ్డి, నాయకులు అశోక్ రావు, కొమరయ్య ఉన్నారు.
పార్టీలో భారీ చేరికలు
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, ప్రభుత్వం అభివృద్ధికి ఆకర్షితులై గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 500 మంది మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గొల్లపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో గొల్లపల్లి ఉపసర్పంచి మారం రాజశేఖర్ ఆధ్వర్యంలో బోనగిరి వెంకటేశ్ అతని అనుచరులు 100 మందితోపాటు 30 మంది మహిళలు, శ్రీరాములపల్లికి చెందిన 20 మంది కార్యకర్తలు చేరారు. ఇక రాఘవపట్నంలో మాజీ ఎంపీటీసీ బుర్ర రాజేందర్ గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కాసాని గంగాధర్, బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు అంకం రాందాస్, రాజ్, బుర్ర నరేష్, నాగరాజ్‌తో 200 మంది యువకులు, మహిళలు చేరారు. అబ్బాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన ఉపసర్పంచి మిల్కురి నర్సయ్య, బీజేవైఎం మండల కార్యదర్శి లక్కం సాయి కుమార్, బీజేపీ నాయకులు ఆకుల రవి, బొట్ల గోపాల్, రాఖేశ్, కాంగ్రెస్ నుంచి జక్కుల నారాయణ, చెవుల మహేశ్, లొత్తునూర్‌లో కాంగ్రెస్ నుంచి 60 మంది బీఆర్ఎస్లో చేరగా, మంత్రి ఈశ్వర్ కండువా కప్పి ఆహ్వానించారు.
శాఖాపూర్ గ్రామం నుంచి
వెల్గటూర్, అక్టోబర్ 17: శాఖాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎలిగేటి వెంకటేశ్, నేరెళ్ల గణేశ్, తనుగుల హరీశ్, తనుగుల సంజీవ్, యాసిన్‌తో పాటు మరో 70 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిని అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల ముందు కాంగ్రెస్, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గండ్ర సుధీర్‌రావు, మూగల సత్యం, రామస్వామి, రమేశ్, జగదీశ్, రవి తదితరులు పాల్గొన్నారు.