కార్పొరేషన్/హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట/ వీణవంక/ సైదాపూర్/ఇల్లందకుంట/ గంగాధర/ శంకరపట్నం/ చిగురుమామిడి/కరీంనగర్‌రూరల్/ మానకొండూర్ రూరల్/ చొప్పదండి/ తిమ్మాపూర్, డిసెంబర్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం నిర్వహించిన వార్డు, గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. కాగా, జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లలో మున్సిపల్ అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, గోదాంగడ్డ, వావిలాలపల్లి, అల్గునూర్, తీగలగుట్టపల్లి, అంబేద్కర్‌నగర్, సుభాష్‌నగర్, బుట్టిరాజారాం కాలనీ, తదితర ప్రాంతాల్లోని కేంద్రాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డు కేంద్రాల్లో.. మండలంలోని కోరపల్లి, మడిపల్లి, మాచనపల్లి, నాగారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల ఆవరణలో ప్రజా పాలన సాఫీగా సాగింది. మున్సిపల్, మండల ప్రత్యేకాధికారులు జనార్దన్‌రావు, నవీన్‌కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.
మండలంలోని నాలుగు గ్రామాల్లో తహసీల్దార్ రజిని, ఎంపీడీవో కల్పన కార్యాలయ ఆవరణలో ప్రజలకు ప్రజా పాలనపై అవగాహన కల్పించారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో శుక్రవారం 4 గంటల వరకు 2,242 దరఖాస్తులు స్వీకరించినట్లు చైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ రాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీధర్, ప్రజాపాలన కార్యక్రమ ప్రత్యేకాధికారి పద్మావతి, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు, పాల్గొన్నారు. వీణవంక మండలం నర్సింగాపూర్‌లో 830 మంది, బేతిగల్‌లో 700 మంది, బొంతుపల్లిలో 350 మంది దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ తిరుమల్ రావు, ఎంపీడీవో కే శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రత్యేకాధికారి డీఈ పీఆర్ మహేశ్వర్, ఎంపీవో ప్రభాకర్, డీటీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు మోరె సారయ్య, చదువు లక్ష్మి-మహేందర్‌రెడ్డి, గంగాడి సౌజన్య-తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు చదువు స్వరూప-నర్సింహారెడ్డి, జడల పద్మలత-రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం దుద్దనపల్లి, ఎలబోతారం, ఎక్లాస్పూర్, ఘణపూర్ గ్రామాల్లో తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో పద్మావతి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
సర్పంచులు తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, కొత్త రాజిరెడ్డి, తడిసిన వెంకటరెడ్డి, మ్యాకల శిరీష, ఎంపీటీసీ చాడ చైతన్య , డీటీ మల్లేశం, ఆర్ఐ శరత్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లిలో 256 మంది, కనగర్తి 494 మంది, లక్ష్మాజీపల్లి 120 మంది, గడ్డివాణిపల్లిలో 90 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీవో శంకర్ తెలిపారు. తహసీల్దార్ రాణి, ఏవో రజిత, అధికారులు పాల్గొన్నారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్లో 900 ఇండ్లకు గానూ 10 కౌంటర్లు, గంగాధరలో 584 ఇండ్లకు గానూ ఎనిమిది కౌంటర్లు, గర్శకుర్తిలో 1200 ఇండ్లకు గానూ ఎనిమిది కౌంటర్లు, గోపాల్రావుపల్లి 180 ఇండ్లకు గానూ రెండు కౌంటర్ల ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గంగాధరలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, గర్శకుర్తిలో డీఆర్డీవో శ్రీలత దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇక్కడ తహసీల్దార్ రమేశ్‌బాబు, ఎంపీడీవో మల్హోత్ర, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కంకణాల విజేందర్‌రెడ్డి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, కంకణాల విజేందర్‌రెడ్డి, అలువాల నాగలక్ష్మి-తిరుపతి, రాసూరి మల్లేశం, ఎంపీటీసీలు తడిగొప్పుల రజిత-రమేశ్ పాల్గొన్నారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లి, అర్కండ్ల, చింతగుట్ట, అంబాలపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో టీం లీడర్స్ జే అనుపమ, శ్రీవాణి ఆధ్వర్యంలో అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు.
చిగురుమామిడి మండలం ఇందుర్తి, గాగిరెడ్డిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆర్డీవో మహేశ్వర్ తనిఖీ చేశారు. ఇందుర్తిలో 528, గాగిరెడ్డిపల్లిలో 291, గునుకులపల్లిలో 136 దరఖాస్తులను స్వీకరించారు. ఆయా చోట్ల ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, మండల ప్రత్యేకాధికారి నతానియల్, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో నర్సయ్య, ఎంపీవో శ్రవణ్ కుమార్, సర్పంచులు అందే స్వరూప, సన్నిళ్ల వెంకటేశం, గునుకుల అమూల్య ఉన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చెర్లభూత్కూర్ గ్రామాల్లో సర్పంచులు ఉప్పుల శ్రీధర్, దబ్బెట రమణారెడ్డి అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. తహసీల్దార్ నవీన్‌కుమార్, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, విద్యుత్ ఏఈలు శ్రీనివాస్, ఆనంద్, వైద్యాధికారులు సూర్యప్రకాశ్, మనోహర్, ఏఈవో ప్రణయ్, పీఆర్ ఏఈ రమణారెడ్డి, ఎంపీవో భార్గవ్, మండల వ్యవసాయాధికారి సత్యం, ఏపీవో శోభారాణి, ఎంఈవో మధుసూదన్, పంచాయతీ కార్యదర్శులు వాజిద్, మల్లయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, వార్డు సభ్యుడు విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నగునూర్‌లో 741, చెర్లభూత్కూర్‌లో 646, చామనపల్లిలో 185, బొమ్మకల్‌లో 1194 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో దివ్యదర్శన్ రావు తెలిపారు. మానకొండూర్ మండలం కొండపల్కల, గంగిపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొండపల్కలలో 1028, గంగిపల్లిలో 1142 మొత్తం 2170 దరఖాస్తులు వచ్చినట్లు టీమ్ ఇన్చార్జి ఎంపీడీవో రాజేశ్వర్ రావు, సూపరింటెండెంట్ వర ప్రసాద్ తెలిపారు. సర్పంచులు నల్ల వంశీధర్ రెడ్డి, మాశం శాలిని, ఎంపీటీసీలు రంగు భాస్కరాచారి, చలిగంటి సంపత్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పరిశీలించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. చొప్పదండి మండలం చిట్యాలపల్లి, దేశాయ్‌పేట, గుమ్లాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ పరిధిలోని 1,2,3,4,5,6వ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమానికి కమిషనర్ శాంతికుమార్ హాజరయ్యారు. ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి దేవేందర్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో రాజగోపాల్, సర్పంచులు గుడిపాటి సురేశ్, గుంట రవి, అప్పిడి సౌజన్య, ఎంపీటీసీ వెల్మ విజయలక్ష్మి-శ్రీనివాస్‌రెడ్డి, కూకుట్ల తిరుపతి, బత్తుల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు చేపూరి హేమ-సత్యనారాయణగౌడ్, బిజిలి అనిత, వడ్లూరి గంగరాజు, నలుమాచు జ్యోతి-రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లిలో 771, గొల్లపల్లిలో 212, బాలయ్యపల్లిలో 151 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.