Loka Bapureddy | కథలాపూర్, జూన్ 14 : రాష్ట్రాన్ని పాలించడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మండిపడ్డారు. కథలాపూర్ మండలం భూషన్రావుపేటలో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులతో నోటీసులు ఇప్పించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారించి ప్రతిపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు.