peddapally | కమాన్ పూర్, ఏఫ్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, యూత్ మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్ అన్నారు. కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామంలో శనివారం బీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 27 న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభకు కమాన్ పూర్ మండలంలో నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రుణమాఫీ అసంపూర్తిగా మిగిలిపోయిందని, రేషన్ కార్డుల జారిలో జాప్యం జరుగుతోందని, రైతు పెట్టుబడి సాయంలో కూడా జాప్యం చేస్తుందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన నేటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు.
ఈ సమావేశంలో మాజీ జడ్పిటీసీ మేకల సంపత్ యాదవ్, మాజీ సర్పంచ్ కొండా వెంకటేష్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మి మల్లు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ లు జాబు సతీష్ , పోలుదాసరి సాయి కుమార్, నాయకులు నీలం శ్రీనివాస్, రాచకొండ రవి, రెడ్డి రాయనర్సు, దండే కిషన్, జాబు శ్రీనివాస్, బైరి అంజయ్య గౌడ్, దీకొండ కొమురయ్య, కొయ్యడ రవి, రాంపల్లి రవి, చినరాయుడు, తోట రాజ్ కుమార్, సాన సురేష్ కురుమ, తాటికొండ హరీష్, పెండ్లి నారాయణ, పల్లె నారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.