Former ZP chairperson Vasantha | జగిత్యాల, ఏప్రిల్ 24 : మహిళల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి నెరవేర్చలేదని దావా వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో 45 వ వార్డులో బీడీ కార్మికులతో వసంత గురువారం ముచ్చటించారు. అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రూ.4వేలు ఇస్తానన్న పెన్షన్, కేసీఆర్ ఇచ్చిన ఫించను వస్తుందని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామంటున్న ఈ ప్రభుత్వం రోజు కూలి చేసుకునే వాళ్ళం బస్సులో ప్రయాణం చేస్తే మా పొట్ట ఎట్లా గడుస్తుందని, రూ.500 తీసుకొని కిరాణా షాప్ కు వెళ్తే రెండు రోజులకు కూడా సరుకులు రావట్లేదని, నిత్యవసర సరుకులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మళ్ళీ కేసీఆర్ వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని అన్నారు. కేసీఆర్, కవిత కృషితో బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందని అందుకుగాను బీఆర్ఎస్ రజతోత్సవ సభ దారి ఖర్చులకు బీడీ కార్మికులు రూ.4వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ సంధ్య కిషోర్, నాయకులు గంగారెడ్డి, పెండం గంగాధర్, ప్రశాంత్, వెంకట్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.