six guarantee schemes | మల్లాపూర్ జులై 4: గ్రామాల్లో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు అన్నారు. మండలంలోని నడికూడ, మొగిలిపేట, ఓబులాపూర్, దామరాజు పల్లి, వాల్గొండ, మల్లాపూర్, గ్రామాల్లో ఎస్సీ సబ్ ప్లాన్ పథకం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, సంఘ భవన నిర్మాణల కోసం స్థానిక నాయకులతో కలిసి సోమవారం భూమిపూజ నిర్వహించారు. అలాగే లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం సర్కారు ఎల్లవేళలా కృషి చేస్తుందని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు తన వంతు ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత, మాజీ జెడ్పిటిసి ఎలాల జలపతి రెడ్డి, నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, నల్ల బాపురెడ్డి, సిరిపురం రవీందర్, నల్ల రాజన్న, బద్దం నర్సారెడ్డి, ఇట్టడి నారాయణ రెడ్డి, రాజేందర్, మహిపాల్, జలపతి రెడ్డి, సురేష్, చల్ల లింగన్న, గంగారెడ్డి, జమాల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.