Tangallapalli | సిరిసిల్ల రూరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారు. ప్రచారానికి చివరీ రోజు కావడం తో శుక్రవారం తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు మోర లక్ష్మి రాజం, పెద్దూరు తిరుపతి, బండి యుగంధర్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ను గెలిపించాలని కేకే మహేందర్ రెడ్డి కోరారు.
మరి ఏ కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటేయాలో చెప్పక పోవడం తో అభ్యర్థులు ఖంగు తిన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పై ముగ్గురిని పోటీకి నిలిపి, తమ అభ్యర్థి పేరు చెప్పక పోవడం, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి, వెళ్లి పోవడం తంగళ్లపల్లి లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి అంకారపు రవీందర్ గెలుపు ఖాయం కావడం ఖాయమని తెలియడం తో ఆఘమేఘాలమీద కే కే మహేందర్ రెడ్డి తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గమనార్హం.