Indiramma house | చిగురుమామిడి, మే 2: ఇల్లిస్తామంటే ఆశగా దరఖాస్తు చేసుకున్నామని, తామంతా అర్హులమని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని సుందరగిరి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తామంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నామని, తాము అర్హులమైన ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తామంతా కిరాయి ఇండ్లలో కిరాయికి ఉంటున్నామని వాపోయారు. ఈ విషయంపై తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో మధుసూదన్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల తేజశ్రీ, ఎనగందుల రాజేశ్వరి, జేరిపోతుల శ్రీనివాస్, వంతడుపుల శ్రీనివాస్, ఎనగందుల తిరుపతి, ఎనగందుల సారవ్వ, ఎనగందుల మహేందర్, పంతడుపుల రజిత, కిన్నెర పూజలత, జేరిపోతుల సంజీవ్ పాల్గొన్నారు.