యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
- జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
- ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 11: నిత్య యోగా సాధనతో మానసిక ప్రశాంతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం 9వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లా యోగా ముగింపు పోటీలు జరిగాయి. పలు జిల్లాల క్రీడాకారులు ఆసనాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు హాజరై, మాట్లాడారు. యోగాను ప్రపంచ దేశాలు అనుకరిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు యోగాను అలవాటు చేయించాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, నిర్వాహకులు ఉప్పల శ్రీనివాస్, పాముల దేవయ్య, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Complete health
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

