Complete health | పెగడపల్లి: ప్రతీ రోజు పోషకాహారాలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా వైద్య, ఆరోగ్య ఉప వైద్యాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు క్రమం తప్పకుండా పోషకాహారాలను తీసుకోవాలని, దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని వివరించారు.
అనంతరం దవఖానలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నరేష్, ఐపీడీఎస్ సూపర్వైజర్లు మహేశ్వరి, సుబద్ర, వైద్య నిపుణులు ఇంతియాజ్ అలీ, ఫాతిమా, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, రవికిరణ్, శ్రీలత, ధనలక్ష్మి, భాస్కర్, కల్పన, జయశీల, ద్వారక, అంగన్వాడీ టీచర్లు రమ, శ్రీదేవి, వనజత, సుజాత, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.