చొప్పదండి, ఫిబ్రవరి11: రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియస్ తీన్మార్ మల్లన్నపై(MLC Teenmar Mallanna) చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చొప్పదండి మండల రెడ్డి జేఏసీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు(Reddy jac) మాట్లాడుతూ.. రాజ్యంగ బద్ధంగా ఎన్నికై రాగద్వేషాలకు అతీతంగా పని చేయాల్సిన ఎమ్మెల్సీ కొన్ని వర్గాల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
వరంగల్ నిర్వహించిన బీసీ బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గాన్ని కించ పరుస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గ్రామాలలో అన్ని కులాలతో ఒకరికొకరం తారతమ్య బేధం లేకుండా కలిసిమెలిసి ఉంటామన్నారు. అలాంటి రెడ్డిలపై తన రాజకీయ లబ్దికోసం ఇస్టానుసారంగా మాట్లాడి తమ మనోభవాలను దెబ్బతీశాడన్నారు. తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అనూషను కోరారు. కార్యక్రమంలో చొప్పదండి మండల రెడ్డి జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.