కలెక్టరేట్, మార్చి 07 : నేటి యాంత్రిక జీవనంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి( Pamela Satpati )అన్నారు. మహిళలు ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే శుక్రవారం సభలు నిర్వహిస్తూ, ఆరోగ్యపరైమన సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఆర్బన్ అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని బాబు జగ్జీవన్ రాం కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో పాల్గొన్నారు.
ఈ సదర్భంగా ఆమె మాట్లాతూ.. అంగన్వాడీ కేంద్రంలో జరిగే ఈసభకు వస్తే మహిళలు అన్ని ఆరోగ్య విషయాలు తెలుసుకోవచ్చన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, ఊరు తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుండన్నారు. భోజనంలో అన్ని పోషకపదార్థాలు తగిన పాళ్లలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. కిసాన్‌నగర్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన అదనపు గది నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబిత, మెప్మా పిడి వేణుమాధవ్, డిప్యూటీ డిఎంహెచ్వో డా సుజాత, డిసిపివో పర్వీన్, పీవో సనా పాల్గొన్నారు.