కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 18 : ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలించినా, పంపిణీ చేసినా టోల్‌ఫ్రీ నంబర్లు 1950, 18004254731కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కంట్రోల్ రూమ్‌లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని, అందుకోసం అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతారని స్పష్టం చేశారు. ఓటరు కార్డు రాకున్నా, ఓటు హక్కు ఉన్నదా? లే దా? అనే విషయం తెలుసుకునేందు కు, ఎలాంటి అనుమానాలైనా నివృత్తి చేసుకునేందుకు ఫోన్ చేయాలని సూచించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఆందోళనలు నిర్వహించినా, సీ-విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
బ్యానర్లు, పోస్టర్లు, మైకులు, సౌండ్ బాక్సుల ఏర్పాటు కోసం సువి ధ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, సీపీవో కే కొమురయ్య, ఆర్డీవో కే మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.